• నగరాన్ని ఎంచుకోండి

త్వరలోనే భారతదేశంలో అన్నీ ట్రక్కులలో AC క్యాబిన్ తప్పనిసరి కానుంది, కానీ ధరలు పెరుగుతాయని హెచ్చరించిన OEMలు

Modified On Jun 21, 2023 07:05 PMBy Dheeraj Nair

2025 నుండి అన్ని ట్రక్కులలో ACని పరిచయం చేయాలని నితిన్ గడ్కరి తీసుకున్న నిర్ణయం ఎన్నో సవాళ్లను ఎదురుకుంటుంది

2025 నుండి భారతదేశంలో తయారయ్యే ట్రక్కులు అన్నిటిలో ఎయిర్ కండిషనర్ క్యాబిన్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రి శ్రీ. నితిన్ గడ్కరి ప్రతిపాదించారు, ఇది ముఖ్యంగా డ్రైవర్‌లకు అలసట తగ్గించడానికి చేసిన ప్రతిపాదన. ఇది అమలులోకి వస్తే ట్రక్కుల ధరలు పెరగవచ్చు. ఎయిర్-కండిషన్ ట్రక్ క్యాబిన్‌లతో డ్రైవర్ల ఉత్పాదకత పెరుగుతుందని డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికిల్స్ (DICV) చెబుతోంది.

భారతదేశ ట్రక్ మార్కెట్లో ఇప్పటికే వోల్వో, స్కానియా వంటి గ్లోబల్ తయారీదారులు ఎయిర్ కండిషన్ (AC) కలిగిన ట్రక్కులను అందిస్తున్నారు, భారతీయ ట్రక్ తయారీదారులు తమ అన్నీ మోడల్‌లలో ACని అందించడం లేదు. అయితే, చాలా వరకు ఆటోమొబైల్ తయారీదారులు బ్లోయర్-ఆధారిత సిస్టమ్ؚలను అందిస్తున్నారు, ఇది AC అంత ప్రభావవంతంగా ఉండదు.

ACని అమర్చడం వలన వాహనం ధర కూడా పెరుగుతుందని వాహన తయారీదారులు తెలియచేసారు. వోల్వో ఐషర్ వాణిజ్య వాహనాల (VECV) MD & CEO వినోద్ అగర్వాల్ ఇలా అన్నారు, “AC క్యాబిన్ؚలను పరిచయం చేయడం వలన, ట్రక్ సైజ్ మరియు మోడల్ؚను బట్టి ధరలు రూ.30,000 నుండి రూ.50,000 వరకు పెరగవచ్చు. ACని అమర్చడానికి కంపెనీలు డ్రైవ్‌ట్రెయిన్ؚను కూడా మార్చవలసి వస్తుంది మరియు ఇంజన్ పవర్ؚను పెంచవలసి వస్తుంది.”

నితిన్ గడ్కరి వ్యాఖ్యలు: 

మహీంద్రా లాజిస్టిక్స్ ఏర్పాటు చేసిన ‘దేశ్ చాలక్’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ”ఈ రోజు ఈ కార్యక్రమానికి రాక ముందు, ట్రక్ డ్రైవర్ కంపార్ట్మెంట్‌లో ఎయిర్ కండిషనింగ్‌ను తప్పనిసరి చేసే ఫైల్పై సంతకం చేశాను. ట్రక్కులను నడిపే వారిని జాగ్రత్తగా చూసుకునేలా నిర్ధారించాలి,” అన్నారు నితిన్ గడ్కరి. 

భారతదేశంలో డ్రైవర్లు 43 నుండి 47 డిగ్రీల కఠిన ఉష్ణోగ్రతలలో వాహనాలను నడుపుతారు, అందువలన, డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్ధం చేసుకోవాలి. నేను మంత్రిని అయిన తరువాత AC క్యాబిన్ؚను పరిచయం చేయాలని చాలా ఆసక్తి చూపాను. కానీ ట్రక్కుల ధర పెరుగుతుందని కొంత మంది దీన్ని వ్యతిరేకించారు. అన్ని ట్రక్కులలో AC క్యాబిన్ؚలు ఉండాలి అని ప్రతిపాదన ఫైల్ పైన నేను సంతకం చేశాను,” అని ఆయన కార్యక్రమంలో తెలిప్పారు.

సంబంధిత లింక్: ప్రత్యేక వారెంటీ మరియు AMCతో భారతదేశంలో సెకండ్ హ్యాండ్ ట్రక్ బ్రాండ్ ‘భారత్ బెంజ్ సర్టిఫైడ్’ను ప్రారంభించిన డైమ్లెర్ ఇండియా

ఈ ప్రతిపాదన ప్రభావం: 

డ్రైవర్ క్యాబిన్‌లో ACని పరిచయం చేయాలనే ప్రతిపాదన చాలా మందికి ముఖ్యంగా డ్రైవర్‌లకు  సానుకూలమైన విషయం, కానీ ట్రక్కులలో ACని అమర్చడం వలన అధిక నిర్వహణ వంటి కొత్త సవాళ్ళు తలెత్తుతాయి. ట్రక్కులు సాధారణంగా అత్యంత కఠినమైన పరిస్థితులలో నడపబడతాయి ఎక్కువగా దుమ్ము, ధూళి వంటివి ఉంటాయి, ACలను అటువంటి పరిస్థితులలో ఉపయోగించడం వలన, ఫిల్టర్లు మరియు ఇతర పరికరాలను క్రమం తప్పకుండా మార్చవలసి రావచ్చు, ఇది సర్వీస్ ఖర్చులను పెంచుతుంది.

నిర్వహణ మాత్రమే కాకుండా, సరుకుల రవాణా చేస్తున్నప్పుడు ACని ఉపయోగించడం వలన ఇంజన్‌పై మరింత ఎక్కువ లోడ్ పడుతుంది మరియు ఇది తక్కువ మైలేజీకు కారణమవుతుంది. ఎక్కువ ఇంధన వినియోగం కారణంగా, ఆపరేటర్లు మరింత ఎక్కువ చెల్లించవలసి వస్తుంది. ఇంధన వినియోగం పెరుగుదల వలన రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. 

అయితే, ట్రక్ క్యాబిన్ؚలో AC ఉండటం వలన, డ్రైవర్ ఉత్పాదకత పెరుగుతుంది, తద్వారా లాజిస్టిక్స్ మరియు ఆపరేటర్ؚకు వేగవంతమైన టర్న్ ఎరౌండ్ కారణంగా లాభదాయకత కూడా పెరుగుతుంది. అందువలన, భారతదేశంలో కొందరు వాహన తయారీదారులు డ్రైవర్ క్యాబిన్ؚలో ACని అందించడానికి సానుకూలంగా ఉన్నారు, మరి కొందరు ACని ప్రామాణిక ఫీచర్లలో చేర్చారు.

భారతదేశంలో AC ఉన్న ట్రక్కులు: 

AC-కలిగిన డ్రైవర్ క్యాబిన్లను అందించే తయారీదారులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి, భారతదేశ రవాణా వాహనాల యజమానులు, తమ రవాణా వాహనాలలో మరింత సౌకర్యం మరియు భద్రత ఫీచర్లను అందించాల్సిన అవసరాన్ని ఉద్దేశపూర్వకంగా గుర్తిస్తున్నారు మరియు AC-అమర్చిన ట్రక్కులను కొనుగోలు చేస్తున్నారు. క్రింద పేర్కొన్న ప్రసిద్ధ AC-అమర్చిన ట్రక్కులకు వారు ప్రాధాన్యతను ఇస్తున్నారు అని చెప్పవలసిన అవసరం లేదు: 

భారత్ؚబెంజ్ 4828R (10 x 2): 4828R అనేది 281hp, AC-అమర్చిన మల్టీ-యక్సిల్ ట్రక్, దీని స్థూల వాహన బరువు (GVW) 47500 కిలోలుగా ఉంది. ఇది ప్రపంచ స్థాయి డీజిల్ పవర్ؚట్రెయిన్ను కలిగి ఉంది, ఇది 1100Nm గరిష్ఠ టార్క్ؚను అందిస్తుంది. ఈ ట్రక్ హైడ్రాలిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ సిస్టమ్ మరియు మెరుగైన డ్రైవబిలిటీ కోసం రేడియల్ టైర్లతో వస్తాయి. 

ఐషర్ ప్రో 8028XM: ప్రో 8028XMలో AC-అమర్చిన స్లీపర్ క్యాబిన్ కలిగి ఉంటుంది ఇది 28000 కిలోల GVW టిప్పర్ ట్రక్. దీనికి ప్రఖ్యాత VEDX8 డీజిల్ ఇంజన్ పవర్‌ను అందిస్తుంది, ఇది 345hp మరియు 1350Nm గరిష్ఠ టార్క్ను అందిస్తుంది. ఈ డంపర్ ట్రక్ ఇంజన్ బ్రేక్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఫ్యూయల్ కోచింగ్ వంటి ఇతర ఫీచర్లలో వస్తుంది.

టాటా సిగ్నా 4221.T: సిగ్నా 4221.T AC-అమర్చిన, మల్టీ-యక్సిల్ 42000 కిలోల ట్రక్, దీనికి టాటా 5.0-లీటర్ల టర్బోట్రాన్ BS6-అనుగుణంగా ఉండే డీజిల్ ఇంజన్ పవర్‌ను అందిస్తుంది. దీని ఇంజన్ 197hp మరియు 850Nmలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ట్రక్కులో మిగిలిన ఫీచర్లతో పాటుగా గేర్ షిఫ్ట్ అడ్వైజర్, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, ట్విన్-స్పీడ్ USB ఛార్జింగ్ పోర్ట్ؚలు మరియు ఎలక్ట్రానిక్ యాంటీ-ఫ్యూయల్ థెఫ్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మా అభిప్రాయం:

డ్రైవర్ క్యాబిన్లలో ACని పరిచయం చేయడం అనే ప్రతిపాదన ఆపరేటర్ల భద్రత మరియు ఉత్పాదకతలను మెరుగు పరిచే దిశలో ఒక సరైన అడుగు. AC కలిగిన డ్రైవర్ క్యాబిన్లు డ్రైవర్ ఉత్పాదకత మరియు డెలివరీ సమయాన్ని మెరుగు పరచవచ్చు, ఆపరేటర్లకు అయ్యే అధిక నిర్వహణ మరియు ఇంధన ఖర్చు వంటి కారకాలను పరిష్కరించవలసిన అవసరం ఉంది. 

అంతేకాకుండా, AC అమర్చిన ట్రక్ క్యాబిన్ల భద్రతను మెరుగుపరచడానికి కౌల్ ట్రక్ మోడల్‌లను నిలిపివేయాల్సి ఉంటుంది. ఏదేమైనా, ట్రక్కు డ్రైవర్ క్యాబిన్లలో ఎయిర్ కండిషనింగ్ؚను తప్పనిసరిగా అమర్చాలనే ఆదేశం, రవాణా పరిశ్రమ భద్రత మరియు అభివృద్ధి వైపుకు ఒక అడుగు. 

మరింత చదవండి

100 LNG ట్రాక్‌ల విక్రయాల మార్క్‌ను అందుకున్న బ్లూ ఎనర్జీ మోటార్ؚలు

BS-6 ఫేజ్ నిబంధనలకు ముందు తమ వాణిజ్య రవాణా వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్

  • ఐషర్ ప్రో 8028ఎక్స్ఎం
    ఐషర్ ప్రో 8028ఎక్స్ఎం
    ₹52.80 - ₹52.90 Lakh*
    • శక్తి 330 Hp
    • స్థూల వాహన బరువు 28000
    • మైలేజ్ 2.5-3.5
    • స్థానభ్రంశం (సిసి) 7698
    • ఇంధన ట్యాంక్ (లీటర్లు) 315
    • ఇంధన రకం డీజిల్
    డీలర్‌తో మాట్లాడండి
  • టాటా సిగ్నా 4221.టి
    టాటా సిగ్నా 4221.టి
    ₹45.25 Lakh నుండి*
    • శక్తి 204 హెచ్పి
    • స్థూల వాహన బరువు 42000
    • మైలేజ్ 4
    • స్థానభ్రంశం (సిసి) 5005
    • ఇంధన ట్యాంక్ (లీటర్లు) 300
    • పేలోడ్ 26000
    డీలర్‌తో మాట్లాడండి
  • భారత్ బెంజ్  4828ఆర్
    భారత్ బెంజ్ 4828ఆర్
    ₹53.81 Lakh నుండి*
    • శక్తి 281 హెచ్పి
    • స్థూల వాహన బరువు 47500
    • మైలేజ్ 2.25-3.25
    • స్థానభ్రంశం (సిసి) 7200
    • ఇంధన ట్యాంక్ (లీటర్లు) 330
    • పేలోడ్ 32500
    డీలర్‌తో మాట్లాడండి

తాజా వాణిజ్య వాహనాలు

*Ex-Showroom Price

ప్రసిద్ధ నమూనాలు

  • ట్రక్కులు
  • పికప్ ట్రక్కులు
  • మినీ ట్రక్కులు
  • టిప్పర్లు
  • ట్రైలర్లు
  • 3 వీలర్
  • ఆటో రిక్షా
  • ఈ రిక్షా
*Ex-Showroom Price
×
మీ నగరం ఏది?