• నగరాన్ని ఎంచుకోండి

టాటా ఏస్ EVతో పోటీగా త్వరలోనే ఫోర్-వీలర్ ఎలక్ట్రిక్ SCVలను విడుదల చేయబోతున్న అశోక్ లేలాండ్

Modified On Jun 28, 2023 02:12 PMBy Dheeraj Nair

టాటా మోటార్స్ భారతదేశంలో ఏకైక ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ చిన్న వాణిజ్య వాహనం (SCV) తయారీదారు కావచ్చు, కానీ ఇది త్వరలోనే మారవచ్చు, అశోక్ లేలాండ్ డోస్ట్ మరియు బడా డోస్ట్ శ్రేణిపై ఆధారపడిన ఎలక్ట్రిక్ SCVలను తమ హోసూర్ LCV ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయాలని ప్రణాళిక చేస్తుంది. 

రాబోయే చిన్న ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలను (e-SCV) తమిళనాడు, హోసూర్ؚలోని తమ లైట్ వాణిజ్య వాహనాల (LCV) ఉత్పత్తి ఫ్యాక్టరీలో అశోక్ లేలాండ్ తయారు చేయనుంది. డోస్ట్ మరియు బడా డోస్ట్ శ్రేణిపై ఆధారపడిన రెండు కొత్త ఎలక్ట్రిక్ ట్రక్కులను కంపెనీ త్వరలోనే విడుదల చేయనుంది.

విడుదల కానున్న ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి తన అనుబంధ బ్రాండ్ స్విచ్ మొబిలిటీతో కలిసి అశోక్ లేలాండ్ పని చేయనుంది. LCV ఉత్పత్తి ఫెసిలిటీలో వాహనాలను అసెంబుల్ చేయాలని మరియు స్విచ్ మొబిలిటీ బ్రాండ్ పేరుతో మార్కెట్ చేయాలని ఈ ట్రక్ తయారీదారు భావిస్తున్నారు. రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలకు ఉండే డిమాండ్‌ను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని అశోక్ లేలాండ్ విశ్వాసంగా ఉంది.

అశోక్ లేలాండ్ వ్యాఖ్యలు: 

“కొత్త చిన్న ఎలక్ట్రిక్ ట్రక్ మా ప్రస్తుత LCV లైన్ నుండి ఉత్పత్తి అవుతుంది మరియు అసెంబ్లీ లైన్‌ను ఇటువంటి ఉత్పత్తుల ప్రొడక్షన్‌కు అనుగుణంగా సర్దుబాట్లు చేస్తున్నాము,” అని అశోక్ లేలాండ్ ప్రెసిడెంట్ & చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్, గణేశ్ మణి, తమ పూర్తి మహిళా LCV ఇంజన్ అసెంబ్లీ లైన్ హోసూర్ ఫ్యాక్టరీ వద్ద బిజినెస్‌లైన్ؚతో అన్నారు.

“LCV విభాగంలో మేము పూర్తి శ్రేణి బ్రాండ్ కావాలని కోరుకుంటు, ముందుకు కొనసాగుతున్నాము. కొత్త మరియు ప్రస్తుతం విభాగాలు రెండిటిలో ఇంటర్మీడియెట్ వాణిజ్య వాహనం (ICV) మరియు ఎలక్ట్రిక్ వేరియెంట్ؚలలో ఉత్పత్తులను తీసుకువస్తాము,” అని ఆయన అన్నారు.

అశోక్ లేలాండ్ ప్రధాన దృష్టి:

అశోక్ లేలాండ్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సిద్దపడుతున్నపటికి, వారి ప్రధాన దృష్టి మాత్రం ఇంటర్నల్ కంబుషన్ ఇంజన్ (ICE) మరియు ప్రత్యామ్నాయ ఇంధన వాహన విభాగంలో సరికొత్త లైన్అప్ మోడల్‌లను పరిచయం చేయడమే లక్ష్యంగా ఉంది.

అంతేకాకుండా, అధిక డిమాండ్ తమ మాడ్యులర్ వెహికల్ ప్లాట్‌ఫారమ్-“AVTR” నుండి వస్తుందని ఈ బ్రాండ్ పేర్కొంది. అందువల్లన, దాని ఉత్తర మరియు దక్షిణ ఉత్పత్తి సౌకర్యాలలో AVTR మోడల్ తయారీ కార్యకలాపాలను బలోపేతం చేయాలని వారు భావిస్తున్నారు.

భారతదేశంలో టాప్ 3 అశోక్ లేలాండ్ డీజిల్ SCVలు: 

అశోక్ లేలాండ్ భారతదేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ SCVని ఇంకా విడుదల చేయలేదు, ప్రస్తుతం ఈ కంపెనీ డీజిల్ ఆధారిత SCVల అద్భుతమైన శ్రేణిని కలిగి ఉంది. వీటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం:

అశోక్ లేలాండ్ డోస్ట్ స్ట్రాంగ్: డోస్ట్ స్ట్రాంగ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 3300rpm వద్ద 59.1hp మరియు సుమారు 1600-2400rpm వద్ద 158Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ؚబాక్స్‌తో వస్తుంది మరియు దీని స్థూల వాహన బరువు రేటింగ్ 2590 కిలోలుగా ఉంటుంది. ఈ ట్రక్ పేలోడ్ సామర్ధ్యం 1375 కిలోలు మరియు ఇది 80kmph వేగానికి చేరగలదు. 

అశోక్ లేలాండ్ బడా డోస్ట్ i2: బడా డోస్ట్ i2లో 1.5-లీటర్‌ల డీజిల్ ఇంజన్ ఉంటుంది, ఇది 3300rpm వద్ద 69.7hp మరియు సుమారు 1600-2400rpm వద్ద 190Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ؚబాక్స్ؚతో జోడించబడింది. ఈ ట్రక్ స్థూల వాహన బరువు రేటింగ్ 2880 కిలోలు. దీని పేలోడ్ 1425కిలోలు మరియు టాప్ స్పీడ్ 80kmph. 

అశోక్ లేలాండ్ డోస్ట్ ప్లస్: డోస్ట్ ప్లస్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 3300rpm వద్ద 70hp మరియు సుమారు 1600-2400rpm వద్ద 170Nm ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ؚబాక్స్ؚకు జోడించబడింది. ఈ ట్రక్ స్థూల వాహన బరువు 2805కిలోలు మరియు రేట్ చేయబడిన పేలోడ్ 1500కిలోలు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ SCVలు:

ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ చిన్న ఫోర్-వీలర్ వాణిజ్య వాహనాలను విక్రయిస్తున్న ఏకైక వాహనదారు టాటా మోటార్స్. ఇది మరేదో కాదు, టాటా ఏస్ EV, రూ. 9.21 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్‌ల విషయంలో, టాటా ఏస్ EV 21.3kWh లిథియం-అయాన్ ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని కలిగి ఉంది మరియు 36.2hp మరియు 130Nm టార్క్‌ను అందించే AC ఇండక్షన్ మోటార్ కూడా ఉంటుంది. ఈ వాహనం పూర్తి ఛార్జింగ్ؚతో 154కిమీ సర్టిఫైడ్ పరిధిని కలిగి ఉంది. 

రెగ్యులర్ ఛార్జింగ్ విధానంలో 20 శాతం నుండి 100 శాతం ఛార్జ్ కావడానికి ఏస్ EV 6-7 గంటల సమయం పడుతుంది మరియు ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్‌లో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 1.75 గంటలు పడుతుంది. బ్రేకింగ్ నుండి కైనటిక్ శక్తిని అందుకొని వాహన బ్యాటరీని ఛార్జ్ చేసే ఎలక్ట్రికల్ శక్తిగా మార్చే రీజనరేటివ్ బ్రేకింగ్ؚతో వస్తుంది.

అంతేకాకుండా, ఈ వాహనం 1840కిలోల స్థూల వాహన రేటింగ్, 600 కిలోల పేలోడ్ మరియు 22 శాతం గ్రేడబిలిటీ రేటింగ్ؚతో వస్తుంది.

భారతదేశంలో ఇతర ఎలక్ట్రిక్ SCVలు:

టాటా మోటార్స్, ఇప్పుడు అశోక్ లేలాండ్ؚతో పాటు, చిన్న ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల విభాగంలో మరొక ప్రముఖ కంపెనీ OSM. ఈ కంపెనీ ఆటో ఎక్స్ؚపో 2023లో, తన సరికొత్త జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ వాణిజ్య వాహనం M1KA 1.0ని 200కిమీ పరిధితో విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం ఈ వాహనం కేవలం లీజింగ్ బేసిస్‌పై మాత్రమే అందుబాటులో ఉంది.

అయినప్పటికీ, అశోక్ లేలాండ్ డోస్ట్ మరియు బడా డోస్ట్ శ్రేణి ఆధారిత ఎలక్ట్రిక్ SCV విడుదలకు వేచి ఉన్నాము మరియు ఈ జీరో-ఉద్గార వాహనాలు విడుదలైన తరువాత మార్కెట్ؚలో అలజడి సృష్టించవచ్చు.

 

  • అశోక్ లేలాండ్ బడా డోస్ట్
    అశోక్ లేలాండ్ బడా డోస్ట్
    ₹8.15 - ₹9.47 Lakh*
    • శక్తి 70 హెచ్పి
    • స్థూల వాహన బరువు 2652
    • మైలేజ్ 13
    • స్థానభ్రంశం (సిసి) 1478
    • ఇంధన ట్యాంక్ (లీటర్లు) 40
    • పేలోడ్ 1250
    డీలర్‌తో మాట్లాడండి
  • ఎలక్ట్రిక్
    ఓఎస్ఎమ్  ఎం1కెఏ 1.0
    ఓఎస్ఎమ్ ఎం1కెఏ 1.0
    ధర త్వరలో వస్తుంది
    • శక్తి 60 హెచ్పి
    • స్థూల వాహన బరువు 2620
    • పేలోడ్ 1000
    • ఇంధన రకం ఎలక్ట్రిక్
    డీలర్‌తో మాట్లాడండి

తాజా వాణిజ్య వాహనాలు

*Ex-Showroom Price

ప్రసిద్ధ నమూనాలు

  • ట్రక్కులు
  • పికప్ ట్రక్కులు
  • మినీ ట్రక్కులు
  • టిప్పర్లు
  • ట్రైలర్లు
  • 3 వీలర్
  • ఆటో రిక్షా
  • ఈ రిక్షా
*Ex-Showroom Price
×
మీ నగరం ఏది?