• నగరాన్ని ఎంచుకోండి

ప్రత్యేక వారెంటీ మరియు AMCతో భారతదేశంలో సెకండ్ హ్యాండ్ ట్రక్ బ్రాండ్ ‘భారత్‌బెంజ్ సర్టిఫైడ్’ను ప్రారంభించిన డైమ్లర్ ఇండియా

Modified On Jun 13, 2023 02:57 PMBy ట్రక్స్దెకో ఎడిటోరియల్ టీమ్

“భారత్ؚబెంజ్ సర్టిఫైడ్” అనే పేరుతో సెకండ్ హ్యాండ్ ట్రక్ బ్రాండ్ؚను భారతదేశంలో ప్రారంభించిన DICV 

ముఖ్యాంశాలు:

 • ‘భారత్ؚబెంజ్ సర్టిఫైడ్’ బ్రాండ్ పేరుతో సెకండ్ హ్యాండ్ వాణిజ్య వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశించపోతున్నట్లు భారత్ؚబెంజ్ ప్రకటించింది. 

 • భారత్ؚబెంజ్ శ్రేణిలో వినియోగించిన లేదా సెకండ్ హ్యాండ్ ట్రక్కుల పునరుద్ధరణ మరియు అమ్మకాలను చేపటనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

 • వినియోగించిన భారత్‌బెంజ్ ట్రక్కులను కొనుగోలు చేసినప్పుడు కస్టమర్‌లకు కొత్త వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ؚను (AMC) ఎంచుకునే ఐచ్చికాన్ని అందిస్తామని ‘భారత్‌బెంజ్ సర్టిఫైడ్’ తెలిపింది.

“భారత్ؚబెంజ్ సర్టిఫైడ్” బ్రాండ్ పేరుతో సెకండ్ హ్యాండ్ వాణిజ్య వాహన మార్కెట్‌లో  ప్రవేశించపోతున్నట్లు భారత్ؚబెంజ్ ప్రకటించింది. ఇది వినియోగించిన భారత్ؚబెంజ్ ట్రక్కుల శ్రేణికి ప్రాప్యతను సులభతరం చేసే సర్టిఫైడ్ వెంచర్.  

ఈ కొత్త బ్రాండ్ పేరుతో, భారత్‌బెంజ్ శ్రేణిలో వినియోగించిన లేదా సెకండ్ హ్యాండ్ ట్రక్కుల పునరుద్ధరణ మరియు అమ్మకాలను చేపడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ కొత్త వ్యాపార కార్యక్రమంతో, తమ వ్యాపారం మరింతగా మెరుగుపడుతుందని కంపెనీ ఆశిస్తోంది.

సెకండ్ హ్యాండ్ భారత్ؚబెంజ్ ట్రక్కులు – మిస్టర్. రాజారాం కె వ్యాఖ్యలు: 

భారత్ؚబెంజ్ మార్కెటింగ్, సేల్స్ మరియు కస్టమర్ సర్వీస్ ప్రెసిడెంట్, కె. రాజారాం ఇలా అన్నారు, “మా నిరంతర మరియు సమగ్ర మార్కెట్ రీసర్చ్ పద్ధతి, వినియోగించిన లేదా సెకండ్ హ్యాండ్ భారత్ؚబెంజ్ ట్రక్కులను కొనుగోలు చేయాలనే కస్టమర్‌ల కోరికను మా దృష్టికి తెచ్చింది. మార్కెట్‌లో ఉన్న ఈ అవసరం, భారత్ؚబెంజ్ సర్టిఫైడ్ؚను ప్రారంభించాలనే ఆలోచనకు బీజం వేసింది, ఇది కంపెనీ నడిపించే ప్రీ-ఓన్డ్ CV వ్యాపార కార్యక్రమం. దీని ద్వారా కస్టమర్‌లు భారత్ బెంజ్ؚను నేరుగా మా వెబ్ؚసైట్ లేదా అధీకృత డీలర్ؚషిప్ؚల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు, తద్వారా మూడవ-పక్ష మధ్యవర్తుల అవసరం ఉండదు.”

వినియోగించిన భారత్ؚబెంజ్ ట్రక్కులు ఎలా సర్టిఫై చేయబడతాయి?

భారత్ బెంజ్ వాహనాలు 125-పాయింట్‌ల నాణ్యత తనిఖీ ద్వారా రీఫర్బిష్మెంట్ చేయబడతాయి, ఇందులో భాగంగా సాంకేతిక చెక్అప్, మరమ్మత్తు మరియు వాహనాల పునరుద్ధరణ కూడా ఉంటాయి. 125- పాయింట్‌ల నాణ్యత తనిఖీ మాత్రమే కాకుండా, డెలివరీకి ముందు వివరణాత్మక ప్రీ-డెలివరీ తనిఖీని కూడా నిర్వహిస్తామని భారత్ బెంజ్ తెలియచేసింది.

పునరుద్ధరించిన రవాణా ట్రక్కులు 6 నెలల వారెంటీతో అందిస్తామని మరియు భారత్ؚబెంజ్ సెకండ్ హ్యాండ్ ట్రక్కులను కొనుగోలు చేసినప్పుడు కస్టమర్‌లు కొత్త వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్‌ను(AMC) కొనుగోలు చేసే ఎంపికని పొందుతారు అని ఈ బ్రాండ్ తెలియజేసింది. అంతేకాకుండా, మునపటి యజమాని నుండి ప్రస్తుత వారెంటీ మరియు AMCలను కూడా బదిలీ చేస్తారు. 

‘భారత్ؚబెంజ్ సర్టిఫైడ్” ఎక్కడ అందుబాటులో ఉంది?

ప్రస్తుతానికి, భారత్ؚబెంజ్ సర్టిఫైడ్ పైలట్ దశలో ఉంది మరియు ట్రైడెంట్ ట్రాకింగ్, బెంగళూరు వద్ద మాత్రమే అందుబాటులో ఉంది, అయితే, ఇది దేశవ్యాప్తంగా అన్ని భారత్ؚబెంజ్ డీలర్ؚషిప్ؚలకు వేగంగా విస్తరించబడుతుంది.

సంబంధిత లింక్: 48-గంటల సర్వీస్ కమిట్మెంట్ؚను అందిస్తూ ‘భారత్ؚబెంజ్ రక్షణ’ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన DICV

ఇదే తరహా కార్యక్రమాలతో ఇతర బ్రాండ్ؚలు:

అశోక్ లేలాండ్ Re-AL:

హిందూజా గ్రూప్ؚలో ప్రధానమైన అశోక్ లేలాండ్ – కూడా ‘Re-AL’ అనే ఈ-మార్కెట్ؚప్లేస్ؚను సెకండ్ హ్యాండ్ వాణిజ్య వాహనాల కోసం ప్రారంభించింది.

ఈ కొత్త ఈ-మార్కెట్ ప్లేస్ కార్యక్రమంలో భాగంగా, అశోక్ లేలాండ్, సెకండ్ హ్యాండ్ కమర్షియల్-గ్రేడ్ ట్రక్కుల కోసం చూస్తున్న కొనుగోలుదారులు లేదా వాహనాలను మార్పిడి చేసుకొని సరికొత్త అశోక్ లేలాండ్ ట్రక్కులు లేదా బస్సులకు అప్ؚగ్రేడ్ చేసుకోవాలనుకుంటున్న వారికి ధృవీకరించిన వాహన చిత్రాలను, ధ్రువీకరించబడిన డాక్యుమెంట్ؚలను మరియు అంచనా నివేదికలను అందిస్తామని తెలిపింది. 

ఐషర్ ష్యూర్: 

ఐషర్ మోటార్స్ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని “ఐషర్ ష్యూర్” అనే పేరుతో ప్రారంభించింది – ఇది ఒక ప్రీ-ఓన్డ్ వాహనాల బ్రాంచ్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ ట్రక్కుల కొనుగోలు మరియు మార్పిడిపై దృష్టి సారిస్తుంది. ఈ బ్రాండ్ కింద, ఐషర్ మోటార్స్ 101-పాయింట్ నాణ్యత తనిఖీలు నిర్వహించడాన్ని మరియు అసలైన ఐషర్ భాగాలతో వాహనాలను రీఫర్బిష్ చేయడాన్ని హామీ ఇస్తుంది.

ఈ ప్రయోజనాలు మాత్రమే కాకుండా, ఐషర్ రీ-ఫైనాన్స్ సౌకర్యం మరియు ఆఫ్టర్ సేల్స్ సేవలను కూడా అందిస్తామని తెలియచేసింది. 

భారత్ؚబెంజ్ వాహనాల గురించి మరింత తెలుసుకునేందుకు, TrucksDekhoను సందర్శించండి, మరియు తయారీదారు నుండి అందుబాటులో ఉన్న ఎంపికలను పరిశీలించండి. వాటి ఫీచర్‌లు, ఆన్-రోడ్ ధరలు, మరియు అగ్ర పోటీదారులను తనిఖీ చేయండి.

మరింత చదవండి

100 LNG ట్రాక్‌ల విక్రయాల మార్క్‌ను అందుకున్న బ్లూ ఎనర్జీ మోటార్ؚలు

BS-6 ఫేజ్ II నిబంధనలకు ముందు తమ వాణిజ్య రవాణా వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్

 

తాజా వాణిజ్య వాహనాలు

*Ex-Showroom Price

ప్రసిద్ధ నమూనాలు

 • ట్రక్కులు
 • పికప్ ట్రక్కులు
 • మినీ ట్రక్కులు
 • టిప్పర్లు
 • ట్రైలర్లు
 • 3 వీలర్
 • ఆటో రిక్షా
 • ఈ రిక్షా
*Ex-Showroom Price
×
మీ నగరం ఏది?