• నగరాన్ని ఎంచుకోండి

నాగపూర్ؚలో మరొక రిటైల్ ఎక్స్ؚపీరియన్స్ సెంటర్ؚను ప్రారంభించిన ఆల్టీగ్రీన్- వాటి వివరాలు

Modified On Jun 13, 2023 12:39 PMBy ట్రక్స్దెకో ఎడిటోరియల్ టీమ్

నాగపూర్ؚలో రిటైల్ ఎక్స్ؚపీరియెన్స్ సెంటర్ؚను ప్రారంభించిన ఆల్టీగ్రీన్, భారతదేశంలో ఇది వారి 31వ రిటైల్ డీలర్ؚషిప్

ముఖ్యాంశాలు: 

  • ఆల్టీగ్రీన్, నాగపూర్ؚలో తమ కొత్త రిటైల్ ఎక్స్ؚపీరియెన్స్ సెంటర్ ప్రారంభాన్ని ప్రకటించింది.

  • నాగపూర్‌లోని కొత్త రిటైల్ ఎక్స్ؚపీరియెన్స్ సెంటర్ ప్రారంభంతో, భారతదేశంలో ఈ బ్రాండ్ రిటైల్ డీలర్ؚషిప్ సెంటర్‌ల సంఖ్య 31కి చేరుకుంది.

  • ఈ రిటైల్ ఎక్స్ؚపీరియెన్స్ సెంటర్ؚను రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రి శ్రీ.నితిన్ గడ్కరి, మరియు ఆల్టీగ్రీన్ వ్యవస్థాపకుడు మరియు CEO డాక్టర్. అమితాబ్ శరణ్ ప్రారంభించారు. 

EV తయారీదారు ఆల్టీగ్రీన్ నాగపూర్‌లో తమ కొత్త రిటైల్ ఎక్స్ؚపీరియెన్స్ సెంటర్ ప్రారంభాన్ని ప్రకటించింది, ఇది ఈ బ్రాండ్ؚకు భారతదేశంలో 31వ రిటైల్ డీలర్ؚషిప్. ముంబై, చెన్నై, హైదరాదాద్, ఢిల్లీ, మరియు బెంగళూరు వంటి మెట్రో నగరాలలో ఇప్పటికే ఈ కంపెనీకి డీలర్ؚషిప్ؚలు ఉన్నాయి.

ఆల్టీగ్రీన్ నాగపూర్ ఎక్స్ؚపీరియెన్స్ సెంటర్ ప్రారంభంతో, వ్యాపారాలు ఈ బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్గో రవాణా వాహనాలకు మెరుగైన ప్రాప్యతను పొందనున్నాయి. ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి, ఆటోమోబైల్ డీలర్ؚషిప్ؚల విభాగంలో మెరుగైన స్థానంలో ఉన్న గార్నెట్ మోటార్ؚతో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆల్టీగ్రీన్ నిర్ణయించుకుంది. 

ఆల్టీగ్రీన్ రిటైల్ ఎక్స్ؚపీరియెన్స్ సెంటర్ؚను రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రి శ్రీ. నితిన్ గడ్కరి మరియు ఆల్టీగ్రీన్ వ్యవస్థాపకుడు మరియు సి‌ఈ‌ఓ డాక్టర్. అమితాభ్ శరణ్ ప్రారంభించారు. 

ఆల్టీగ్రీన్ రిటైల్ ఎక్స్ؚపీరియెన్స్ సెంటర్‌పై వ్యాఖ్యలు:

ఈ కార్యక్రమంలో మాట్లాడుతు, రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రి శ్రీ.నితిన్ గడ్కరి ఇలా అన్నారు, “EVలకు మారుతున్న దేశాలలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తోంది. భారతదేశంలో తయారైన, భారతదేశం కోసం తయారైన ఆల్టీగ్రీన్ EVలను నేను అభినందిస్తున్నాను, ఇవి భారత వాతావరణం మరియు రోడ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.  

EVల స్వీకరణతో, రాబోయే సంవత్సరాలలో భారతదేశంలో 3-వీలర్ పరిశ్రమ గణనీయమైన అభివృద్ధిని సాధించనుంది. క్లీనర్ మరియు గ్రీనర్ ఎకానమీ కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఎలక్ట్రానిక్ వాహనాలకు (EVలు) మారడం ఇటీవల భారతదేశంలో ఊపందుకుంది, మరియు ఈ మార్పును ప్రేరేపించడంలో 3-వీలర్ పరిశ్రమ ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది.” 

సంబంధిత లింక్ؚ: 3-వీలర్ EV కొనుగోలును సులభతరం చేయడానికి సుందరం ఫైనాన్స్ మరియు ఇండియన్ బ్యాంక్ؚతో కలిసి పని చేయనున్న ఆల్టీగ్రీన్

అమితాబ్ శరణ్, ఆల్టీగ్రీన్ వ్యవస్థాపకుడు మరియు CEO, మాట్లాడుతు, “భారతదేశ రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రి శ్రీ.నితిన్ గడ్కరి ఈ రోజు ఇక్కడ, మానతో నాగపూర్ؚలో ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఆయన మార్గదర్శకత్వంలో, ఎలక్ట్రిక్ మరియు ప్రత్యామ్నాయ-ఇంధన వాహనాలను ప్రోత్సహించడానికి మరియు స్వీకరించడానికి పన్ను రాయితీలు, సబ్సిడీలు మరియు మినహాయింపులతో అనేక కార్యక్రమాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. 

ఈ ప్రోత్సాహకాలు ప్రత్యేకించి భారత ఆర్ధిక రంగంలో గణనీయమైన పాత్రను పోషిస్తున్న ఎలక్ట్రిక్ 3-వీలర్ విభాగానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. విభిన్న వాహన విభాగాలలో అగ్రశ్రేణి ఉత్పత్తులను మరియు సేవలను అందించడానికి నాగపూర్‌లోని గార్నెట్ మోటార్ؚతో కలిసి పని చేయడానికి మేము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము,” అని ఆయన అన్నాడు.

ఉత్తమమైన ఆల్టీగ్రీన్ ఎలక్ట్రిక్ వాహనం:

ఇటీవల ఆల్టీగ్రీన్ NeEV Tezను పరిచయం చేసింది, ఇది ప్రపంచంలోనే వేగంగా ఛార్జ్ అయ్యే 3-వీలర్, ఇందులో ఎక్స్ؚపొనెంట్ 3-ఇన్-వన్ కనెక్టర్ ఊంది. ఈ వాహనం 3000-సైకిల్ బ్యాటరీ జీవితకాల వారెంటీతో వస్తుంది అంతేకాకుండా 100 శాతం ర్యాపిడ్ ఛార్జింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

NeEV Tez 8.2kWh బ్యాటరీ ప్యాక్ؚను కలిగి ఉంటుంది. దీని 8.25 KW ఎలక్ట్రిక్ మోటార్ క్లెయిమ్ చేసిన 810Nm పీక్ టార్క్ؚను (వీల్ వద్ద) అందిస్తుంది. 

ధృఢత్వం కోసం ఆల్టీగ్రీన్ NeEV Tez హెలికల్ స్ప్రింగ్, డ్యాంపర్ మరియు హైడ్రాలిక్ షాక్ అబ్సార్బర్‌లను కలిగి ఉంది, వెనుక భాగంలో బరువును-మోసే శక్తి కోసం లీఫ్ స్ప్రింగ్‌లతో ధృఢమైన ఆక్సిల్ సెట్అప్ ఉంటుంది. ఈ 3-వీలర్ గరిష్ట వేగం 53kmph ఉంటుందని మరియు 98km (ARAI సర్టిఫైడ్) క్లెయిమ్ చేసిన పరిధిని అందిస్తుంది అని ఆల్టిగ్రీన్ తెలిపింది.

మైసూర్ ప్యాలెస్ నుండి బెంగళూర్ ప్యాలెస్ మధ్య 150+కిమీ అంతర నగర ప్రయాణాన్ని పూర్తి చేయడం ద్వారా NeEV పనితీరును కూడా ఈ బ్రాండ్ ప్రదర్శించింది.

ఆల్టీగ్రీన్ NeEV Tez రూ.3.55 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది పియాజియో ఏపిఈ ఈ-ఎక్స్ట్రా, OSM రేజ్ ప్లస్ మరియు OSM రేజ్ ప్లస్ ర్యాపిడ్ వంటి వాటితో పోటీ పడుతుంది. 

ఆల్టీగ్రీన్ వాహనాల గురించి మరింత తెలుసుకునేందుకు, TrucksDekhoను సందర్శించండి, మరియు తయారీదారు నుండి అందుబాటులో ఉన్న అన్నీ ఎంపికలను పరిశీలించండి. వాటి ఫీచర్ లు, ఆన్-రోడ్ ధరలు, మరియు అగ్ర పోటీదారుల గురించి తెలుసుకోండి.

మరింత చదవండి 

పియాజియో ఏపిఈ సిటీ+: మీరు తెలుసుకోవలసినవి

100 LNG ట్రాక్‌ల విక్రయాల మార్క్‌ను అందుకున్న బ్లూ ఎనర్జీ మోటార్ؚలు

 

  • ఎలక్ట్రిక్
    ఆల్టిగ్రీన్ neEV TEZ
    ఆల్టిగ్రీన్ neEV TEZ
    ₹3.55 Lakh నుండి*
    • శక్తి 11 హెచ్పి
    • స్థూల వాహన బరువు 950
    • పేలోడ్ 550
    • ఇంధన రకం ఎలక్ట్రిక్
    డీలర్‌తో మాట్లాడండి

తాజా వాణిజ్య వాహనాలు

*Ex-Showroom Price

ప్రసిద్ధ నమూనాలు

  • ట్రక్కులు
  • పికప్ ట్రక్కులు
  • మినీ ట్రక్కులు
  • టిప్పర్లు
  • ట్రైలర్లు
  • 3 వీలర్
  • ఆటో రిక్షా
  • ఈ రిక్షా
*Ex-Showroom Price
×
మీ నగరం ఏది?