• నగరాన్ని ఎంచుకోండి

750 కిలోల సామర్ధ్యం, విభాగంలోనే ఉత్తమ మైలేజ్‌తో సుప్రో CNG డుయోను ప్రారంభించిన మహీంద్రా

Modified On Jun 13, 2023 02:46 PMBy ట్రక్స్దెకో ఎడిటోరియల్ టీమ్

చిన్న వాణిజ్య వాహనం (SCV) ద్వంద్వ-ఇంధన సుప్రో CNG డుయోను విడుదల చేసిన మహీంద్రా. 

ముఖ్యాంశాలు: 

- మహీంద్రా & మహీంద్రా, చిన్న వాణిజ్య వాహనం (SCV) ద్వంద్వ-ఇంధన సుప్రో CNG డుయో విడుదలను ప్రకటించింది.

-మహీంద్రా సుప్రో ప్రోఫిట్ ట్రక్ మినీతో పోలిస్తే, కొత్త సుప్రో CNG డుయో స్పెసిఫికేషన్‌ల పరంగా కొంత అధిక పవర్‌ను విడుదల చేస్తుంది.

- పోటీదారులకు సమానంగా, సుప్రో CNG డుయో ధర రూ. 6.32 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభమవుతుంది.

మహీంద్రా & మహీంద్రా, చిన్న వాణిజ్య వాహనం (SCV) ద్వంద్వ-ఇంధన సుప్రో CNG డుయో విడుదలను ప్రకటించింది. సుప్రో CNG డుయో విభాగంలోనే ఉత్తమమైన పేలోడ్, సాటిలేని మైలేజ్ మరియు అత్యధిక పవర్ؚను కస్టమర్లకు అందిస్తుందని ఈ కారు తయారీదారు తెలియచేసింది.

మహీంద్రా సుప్రో ప్రోఫిట్ ట్రక్ మినీతో పోలిస్తే, కొత్త సుప్రో CNG డుయో స్పెసిఫికేషన్‌ల పరంగా కొంత ఎక్కువ పవర్ మరియు పనితీరును అందిస్తుంది. సుప్రో CNG డుయో 20.01kW (27BHP) గరిష్ట పవర్‌ను మరియు 60Nm పీక్ టార్క్ؚను విడుదల చేస్తుంది, సుప్రో ప్రోఫిట్ ట్రక్ మినీ కేవలం 19.4kW పవర్‌ను మరియు 58Nm ؚటార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 

పేలోడ్ సామర్ధ్యల విషయానికి వస్తే, సుప్రో ప్రోఫిట్ ట్రక్ మినీ 900 కిలోలుగా రేట్ చేయబడిన పేలోడ్ؚను కలిగి ఉంది, సుప్రో CNG డుయో పేలోడ్ కేవలం 750 కిలోలుగా ఉంది. అయితే, ఇదే విభాగంలోని టాటా ఏస్ గోల్డ్ CNG రేటెడ్ పేలోడ్ 650 కిలోలతో పోలిస్తే, సుప్రో డుయో ఈ విభాగంలోనే ఉత్తమమైన రేటెడ్ పేలోడ్ను కలిగి ఉంది.

పేలోడ్ సామర్ధ్యం కాకుండా, మహీంద్రా సుప్రో డుయో ఈ విభాగంలోనే ఉత్తమమైన మైలేజ్‌ను కూడా అందిస్తుంది. ఈ కొత్త ట్రక్ kgకి 23.35 km ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందని కంపెనీ తెలియచేసింది, ఇది టాటా ఏస్ CNG ట్రక్ మరియు ఇతర పోటీదారుల కంటే అధికం. కాబట్టి, మహీంద్రా సుప్రో CNG డుయో, మహీంద్రా క్లెయిమ్ చేసినట్లు ఈ విభాగంలోనే ఉత్తమమైనది కావచ్చు.

మహీంద్రా సుప్రో CNG డుయో – బ్రాండ్ వ్యాఖ్యలు: 

ఆర్. వేలుస్వామి, ప్రెసిడెంట్, ఆటోమోటివ్ టెక్నాలజీ మరియు ప్రోడక్ట్ డెవలప్మెంట్, మహీంద్రా & మహీంద్రా ఇలా అన్నారు, “కొత్త సుప్రో CNG డుయో స్మార్ట్ మరియు తేలికగా నడపగలిగే ద్వంద్వ-ఇంధన చిన్న వాణిజ్య వాహనంగా రూపొందించబడింది, ఇది ఉద్గారాలను మాత్రమే కాకుండా ఆపరేటింగ్ ఖర్చులను కూడా తగ్గిస్తుంది, తద్వారా గణనీయంగా డబ్బును ఆదా చేస్తుంది. 

కొత్త సుప్రో CNG దుయోలో మేము పరిశ్రమలోనే మొదటిసారిగా వస్తున్న అనేక ఫీచర్లను పొందుపరిచాము – వీటిలో డైరెక్ట్ స్టార్ట్ CNG, గరిష్ట భద్రత కోసం ఇంటలిజెంట్ CNG లీక్ డిటెక్షన్ మరియు విభాగంలోనే ఉత్తమమైన 750కిలోల పేలోడ్ సామర్ధ్యం చెప్పాలంటే ఇంకా మరెన్నో, మెరుగైన మైలేజ్ మరియు 75 లీటర్ల భారీ CNG ట్యాంక్ సామర్ధ్యం కలయికతో, కొత్త సుప్రో CNG డుయోతో మైలేజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

ఈ వినూత్నమైన మరియు మరిన్ని ఫీచర్‌ల కారణంగా, మహీంద్రా సరికొత్త చిన్న కమర్షియల్ వాహనం మరొకసారి కస్టమర్లకు మరియు ఆపరేటర్లకు విలువైనదిగా రుజువవుతుందని మేము విశ్వసిస్తున్నాము.”

సంబంధిత లింక్: ధరలు మరియు మైలేజ్తో భారతదేశంలో 10 ఉత్తమ మినీ ట్రక్కులు

మహీంద్రా సుప్రో CNG డుయో సురక్షితమైనదేనా?

కొత్త సుప్రో CNG డుయో నిశితంగా అభివృద్ధి చేసిన మరియు కఠినంగా పరీక్షించిన CNG మరియు పెట్రోల్ కిట్ؚతో వస్తుందని, ఇది అత్యుత్తమ విశ్వసనీయత మరియు పనితీరును నిర్ధారిస్తుందని మహీంద్రా తెలియచేస్తుంది. ఈ కారు తయారీదారు వెల్లడించిన్నట్లుగా ఇంటెలిజెంట్ CNG లీకేజ్ డిటెక్షన్ సిస్టమ్ؚ కస్టమర్ భద్రతను నిర్ధారిస్తుంది.

అదనంగా, అత్యవసర పరిస్థితిలో వేగంగా స్పందించడం కోసం, అనుకూలంగా అమర్చిన ఫైర్ ఎక్స్ؚటింగ్విషర్ؚను కూడా ఈ ట్రక్ؚతో అందిస్తోంది. 

మహీంద్రా సుప్రో CNG డుయో ధర:

మహీంద్రా సుప్రో CNG డుయో రూ.6.32 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. టాటా ఏస్ గోల్డ్ CNG మరియు మారుతి సూపర్ క్యారీ CNG వంటి వాటి నుండి పోటీని ఎదుర్కొంటుంది.

మహీంద్రా వాహనాల గురించి మరింత తెలుసుకునేందుకు, TrucksDekhoను సందర్శించండి, మరియు ఈ తయారీదారు నుండి అందుబాటులో ఉన్న అన్నీ ఎంపికలను పరిశీలించండి. వాటి ఫీచర్లు, ఆన్-రోడ్ ధరలు మరియు ముఖ్యమైన పోటీదారుల గురించి తనిఖీ చేయండి.

మరింత చదవండి

టాటా ఇంట్రా V30: Googleؚలో ఎక్కువగా అడిగిన 13 ప్రశ్నలకు సమాధానాలు

భారతదేశంలో టాప్ 5 CNG మినీ ట్రక్కులు

 

తాజా వాణిజ్య వాహనాలు

*Ex-Showroom Price

ప్రసిద్ధ నమూనాలు

  • ట్రక్కులు
  • పికప్ ట్రక్కులు
  • మినీ ట్రక్కులు
  • టిప్పర్లు
  • ట్రైలర్లు
  • 3 వీలర్
  • ఆటో రిక్షా
  • ఈ రిక్షా
*Ex-Showroom Price
×
మీ నగరం ఏది?