• నగరాన్ని ఎంచుకోండి

భారతదేశంలో మొబిల్ ల్యూబ్రికెంట్ؚ ప్రకటనలలో కనిపించనున్న హృతిక్ రోషన్

Modified On Jun 13, 2023 10:38 AMBy ట్రక్స్దెకో ఎడిటోరియల్ టీమ్

మొబిల్ ల్యూబ్రికెంట్ؚల కొత్త బ్రాండ్ అంబాసడర్ؚగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్

ల్యూబ్రికేషన్ సాంకేతికత మరియు ఆవిష్కరణలలో ప్రపంచంలో అగ్రగామి మొబిల్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌ను భారతదేశంలో తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. చురుకైన మరియు ఆత్మ విశ్వాసాన్నీ కలిగిన ఈ నటుడు, మానవ పురోగతిని సాధించేలా మరియు పూర్తి సామర్ధ్యాన్ని ఉపయోగించేలా కస్టమర్‌లను సాధికారులని చేయాలనే బ్రాండ్ విజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఎక్సాన్ మొబిల్ ల్యూబ్రికెంట్ CEO మిస్టర్. విపిన్ రాణా ఇలా అన్నారు, “భారతదేశంలో మా మొబిల్ ల్యూబ్రికెంట్ ల కోసం హృతిక్ రోషన్ తో భాగస్వాములం కావడం మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. అతని వ్యక్తిత్వం వాణిజ్య భాగస్వాములను బాగా ఆకట్టుకునేందుకు మరియు భారతదేశం ల్యూబ్రికేషన్ అవసరాలను తీర్చడానికి మొబిల్ ఏం చేయగలదు అనే విషయాన్ని గురించి వినియోగదారులు విశ్వాసాన్ని కలిగి ఉండేందుకు సహాయపడుతుంది అని మేము నమ్ముతున్నాము.”

ఈ భాగస్వామ్యం పట్ల హృతిక్ రోషన్ తన ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తూ “మొబిల్‌తో భాగస్వామ్యం కోసం మరియు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ నమ్మకమైన బ్రాండ్ పేరుతో పని చేయడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. ప్రజల జీవితాలలో మరియు సమాజంలో మార్పు తీసుకురాగలిగే విజేతల నిజమైన శక్తి ఆత్మ విశ్వాసం అని నేను బలంగా విశ్వసిస్తాను, మొబిల్ బ్రాండ్ కూడా ఇదే తెలియచేస్తుంది” అన్నారు.

సంబంధిత లింక్: 3-వీలర్ EV కొనుగోలును సరళీకరించడానికి సుందరం ఫైనాన్స్ మరియు ఇండియన్ బ్యాంక్ؚలతో జతకట్టిన ఆల్టీగ్రీన్

మొబిల్ ఈ నటుడితో భాగస్వాములు కావడం ఇది మొదటిసారి కాదు. సరైన ఎంపికలతో సొంత సంక్షేమాన్ని సంరక్షించుకోవడం ముఖ్యం అనే సందేశాన్ని ఇచ్చిన, హృతిక్ నటించిన యాక్షన్-థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్ వేద”తో కూడా వీరు భాగస్వామ్యం కలిగి ఉన్నారు. 

మొబిల్ దాదాపు ఒక శతాబ్దంపైగా ప్రపంచ ల్యూబ్రికేషన్ అవసరాలను తీరుస్తున్నది. సాంకేతిక అగ్రగామిగా వినియోగదారుల అవసరాలను తీర్చగల ఉత్పత్తులను ఈ బ్రాండ్ తయారుచేస్తుంది. క్లాస్ؚతో సంబంధం లేకుండా, గొప్ప ఇంజన్ పనితీరును మరియు వాహనాల సంరక్షణను నిర్ధారించడంలో సహాయపడటానికి ఇవి రూపొందించబడ్డాయి. ఖర్చు సామర్ధ్యం, ఉత్పాదకత, మరియు వ్యాపార భాగస్వాముల కోసం ఎక్విప్మెంట్ సామర్ధ్యాలను కూడా అందిస్తుంది.

మరింత చదవండి

పియాగియో ఏప్ సిటీ+: మీరు తెలుసుకోవలసినవి 

100వ LNG ట్రాక్ రోల్ అవుట్ؚ మార్క్ؚను చేరుకున్న బ్లూ ఎనర్జీ మోటార్స్

తాజా వాణిజ్య వాహనాలు

*Ex-Showroom Price

ప్రసిద్ధ నమూనాలు

  • ట్రక్కులు
  • పికప్ ట్రక్కులు
  • మినీ ట్రక్కులు
  • టిప్పర్లు
  • ట్రైలర్లు
  • 3 వీలర్
  • ఆటో రిక్షా
  • ఈ రిక్షా
*Ex-Showroom Price
×
మీ నగరం ఏది?