భారతదేశంలో విడుదల అయిన 430Nm టార్క్ؚను అందించే ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ 3-వీలర్స్

Modified On Jun 22, 2023 06:03 PMBy Dheeraj Nair

ఒమేగా సీకి మొబిలిటీ (OSM) తమ మొదటి నగర ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ 3-వీలర్ లైన్అప్ؚను భారతదేశంలో విడుదల చేసింది. ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ రెండు వేరియెంట్‌లతో వస్తుంది–ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ ATR, దీని ధర రూ.1.85 లక్షలుగా ఉంది (ఎక్స్-షోరూమ్)’ రెండవది ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ 8.5, దీని ధర రూ.3.01 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. 

ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ ATRలో మార్చగల బ్యాటరీ ఉంటుంది, స్ట్రీమ్ సిటీ 8.5 మాత్రం స్థిరమైన బ్యాటరీతో వస్తుంది. ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ 8.5 స్థిరమైన బ్యాటరీ వేరియెట్ సింగిల్ ఛార్జ్ؚతో కేవలం 4 గంటల ఛార్జింగ్ సమయంతో 117కిమీ పరిధిని అందిస్తుంది, ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటి ATR 80 కిమీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. 

రెండు వేరియెంట్‌లు 48kmph టాప్ స్పీడ్‌ను, 16 శాతం గ్రేడబిలిటీ మరియు 950కిలోల స్థూల వాహన బరువు రేటింగ్ కలిగి ఉన్నాయి. రెండు వేరియెంట్‌లు D+3 సీటింగ్ మరియు మెరుగైన స్థిరత్వం మరియు రైడ్ సౌకర్యం కోసం 4.50x10 తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ టైర్‌లతో వస్తాయి. ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ రెండు వేరియెంట్‌లు 1940మిమీ వీల్ؚబేస్ؚతో సహా కొలతలలో సమానంగా ఉంటాయి.

సంబంధిత లింక్: నాగపూర్ؚలో మరొక రిటైల్ ఎక్స్ؚపీరియన్స్ సెంటర్ؚను ప్రారంభించిన ఆల్టీగ్రీన్- వాటి వివరాలు

ఒమేగా సీకి మొబిలిటీ వ్యాఖ్యలు:

విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ ఉదయ్ నారంగ్, “మేము మా ప్రయాణాన్ని కార్గో వాహనాలతో ప్రారంభించాము. ఈ విడుదల, కార్గో మరియు ప్యాసెంజర్ విభాగాలు రెండిటికీ పూర్తి 3W పరిష్కారాన్ని అందించాలనే మా వ్యూహానికి అనుగుణంగా ఉంది. ఈ సంవత్సరం, మా దృష్టి ఫ్యాసెంజర్ వాహనాల పైన ఉంటుంది మరియు దీని పట్ల ఒమేగా సీకి మొబిలిటీకి ఉన్న బలమైన నిబద్ధతకు ఫలితం ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ. 

ఒమేగా సీకి మొబిలిటీ స్ట్రీమ్ సిటీ శ్రేణి అతి పెద్ద కస్టమర్ బేస్ అవసరాలను తీర్చడానికి అసమానమైన అవకాశాలతో భారతదేశంలోని ఇ-రిక్షా డ్రైవర్‌లను సాధికారులను చేస్తుంది, తద్వారా వారి ఆదాయ సంభావ్యతను అనుకూలీకరించగలిగేలా చేస్తుంది. ఆదాయ సంభావ్యతలో 15-10 శాతం పెరుగుదలను ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ 3-వీలర్ అందిస్తుంది, ఇది మరింత ఎక్కువ ఆదాయం మరియు ఎక్కువ పొడుపును నిర్ధారిస్తుంది,” అన్నారు.

ఏ ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ వేరియెంట్ؚను ఎంచుకోవాలి?

వాహనం

ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ 8.5 (స్థిరమైన బ్యాటరీ ) 

ఓఎస్ఎమ్ స్ట్రీమ్ATR (మార్చగల బ్యాటరీ)

బ్యాటరీ సామర్ధ్యం

8.5kWh

6.3kWh

గేర్ؚబాక్స్

మాన్యువల్ బూస్ట్

మాన్యువల్ బూస్ట్

పవర్ 

12.8hp

12.8hp

టార్క్ 

430Nm

430Nm

పరిధి

117కిమీ

80కిమీ

ఛార్జ్ సమయం 

4 గంటలు

NA 

ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ స్థిరమైన బ్యాటరీ వేరియెంట్ 8.5kWh, లిథియం-అయాన్, 48V బ్యాటరీ ప్యాక్ మరియు 12.8hp మరియు 430Nm టార్క్‌ను అందించే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ؚను కలిగి ఉంటుంది. మరొకవైపు, ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ ATR మార్చగల 6.3kWh లిథియం-అయాన్, 48V బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది, ఎలక్ట్రిక్ మోటార్ ఒకే విధమైన 12.8hp మరియు 430Nmని ఉత్పత్తి చేస్తుంది.

రెండు వేరియెంట్‌లు ఒకే విధమైన పవర్ గణాంకాలను ఉత్పత్తి చేస్తున్నపటికి, బ్యాటరీ సామర్ధ్యం పూర్తిగా భిన్నంగా ఉంటుంది, అందువలన డ్రైవింగ్ పరిధులు మారుతాయి. ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ స్థిరమైన బ్యాటరీ వేరియెంట్ సింగిల్ ఛార్జ్‌తో 117 కిలోమీటర్‌ల పరిధిని అందిస్తుంది, బ్యాటరీని మార్చగల వేరియెంట్ 80 కిమీ పరిధిని అందిస్తుంది.

అందువలన, స్ట్రీమ్ సిటీ 8.5 సరైన ఎంపికగా కనిపిస్తుంది, అయితే, మార్చగల బ్యాటరీ ప్యాక్‌లతో వచ్చే ఎలక్ట్రిక్ వాహనాలతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు, బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఆపరేటర్‌లు గంటలపాటు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. బదులుగా, వారు పూర్తిగా ఛార్జింగ్ ఉన్న బ్యాటరీని మార్చుకోవచ్చు, దీనికి కేవలం సుమారు 10 నిమిషాలు పడుతుంది. 

అందువలన, మరింత పరిధి మరియు ఇంటి వద్ద వాహనాన్ని ఛార్జ్ చేసే సౌకర్యం కోరుకునే వారికి ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటి 8.5 మెరుగైన ఎంపిక. మరొకవైపు, ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ ATR, వేగవంతంగా బ్యాటరీ మార్చడాన్ని కోరుకునే వారికి సరైనది, ఇది ఖాళీగా ఉండే సమయాన్ని తగ్గింది, లాభదాయకతను గరిష్టం చేసుంది. 

మరింత చదవండి 

100 LNG ట్రాక్‌ల విక్రయాల మార్క్‌ను అందుకున్న బ్లూ ఎనర్జీ మోటార్ؚలు

BS-6 ఫేజ్ నిబంధనలకు ముందు తమ వాణిజ్య రవాణా వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్

₹3.72 Lakh నుండి*
  • శక్తి 10 kW
  • స్థూల వాహన బరువు 960
  • ఇంధన రకం ఎలక్ట్రిక్

తాజా వాణిజ్య వాహనాలు

ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్

ప్రసిద్ధ నమూనాలు

  • ట్రక్కులు
  • పికప్ ట్రక్కులు
  • మినీ ట్రక్కులు
  • టిప్పర్లు
  • ట్రైలర్లు
  • 3 వీలర్
  • ఆటో రిక్షా
  • ఈ రిక్షా
*ఎక్స్-షోరూమ్ ధర in New-Delhi