• నగరాన్ని ఎంచుకోండి

ట్రక్స్దెకో గురించి

ట్రక్కులను కనుగొనడానికి ట్రక్స్దెకో వన్-స్టాప్ డెస్టినేషన్. ట్రక్కులను సులభంగా శోధించే ఎంపికలు మరియు శోధన ఫలితాలను వేగవంతంగా ప్రదర్శించడం ద్వారా ట్రక్స్దెకో, ట్రక్కులను వెతకడాన్ని ఎన్నడూ లేనంత సులభతరం చేసింది. అన్ని సౌకర్యాలతో, ట్రక్కింగ్ గురించి అక్షరాలా అన్ని విషయలు తెలిసిన సంస్థగా దీనికి భారతదేశం అంతటా ట్రకింగ్ అవసరాలను తీర్చడం ఎలాగో తెలుసు! భారీ చక్రాల గురించిన సమాచారం ఒకే చోట ఉంచాలనే ఉద్దేశంతో, దాన్ని మీకు అందించడం ద్వారా మిమ్మల్ని ఆకట్టుకోవడంలో ఇది ఎన్నడూ విఫలం కాలేదు. అది కొనుగోలు, అమ్మకం, సేవ, సమాచారం, నిపుణుల సలహాలతో సహా ట్రక్కులకు సంబంధించిన అన్ని విషయాల కోసం దీన్ని ఉపయోగించవచ్చు!

గతం గురించి చిన్న సమాచారం..

కార్‌ల గురించి నాణ్యమైన సమాచారాన్ని నాణ్యమైన వాతావరణంలో అందించాలనే ఉద్దేశంతో నలుగురు వ్యక్తుల బృందం కంపెనీ ప్రధాన ఉత్పత్తి కోసం మార్చి 2008లో శంఖుస్థాపన చేయడం ద్వారా ఈ ప్రయాణం కార్దెకోతో ప్రారంభమైంది. దేశంలోని ప్రధాన IT సంస్థ గిర్నార్ సాఫ్ట్‌వేర్ యొక్క అనుబంధ సంస్థ అయిన గిర్నార్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సంస్థగా, కార్దెకో నేడు బైక్దెకో, ప్రైజ్దెకో, మొబైల్దెకో లాంటి మరెన్నో ఇతర సారూప్య వెంచర్‌లతో ఒక కుటుంబంలా విస్తరించింది. ప్రారంభం నుండి, ఈ ఆటో-పోర్టల్ దేశంలోని ఔత్సాహిక కొనుగోలుదారులు, గర్వించే యజమానులు, డై-హార్డ్ అభిమానులు, కార్‌ల డీలర్‌లకు సాధ్యమైన అన్ని విధాలుగా సేవలను అందించడానికి కృషి చేసింది, కార్‌లకు సంబంధించిన ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అందించడంలో వారికి సహాయపడటానికి మరియు మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించింది. ఇన్ని సంవత్సరాలుగా మేం దీన్ని కొనసాగించడానికి మరియు వృద్ధి చెందడానికి కారణం పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌పై మా కృషికి వచ్చిన తగిన గుర్తింపు. ఎప్పటికప్పుడు, ప్రత్యేకించి ఈ వెంచర్ అందుకున్న అవార్డులు మరియు ప్రశంశలు మమ్మల్ని అంకితభావంతో పనిచేసేల ప్రేరణ కలిగించాయి. ‘ఉత్తమ ఆటోమోటివ్ వెబ్‌సైట్ 2009’తో ప్రారంభించి, కార్దెకో ఎన్నో ప్రసిద్ధ సంస్థల నుండి ఎన్నో రకాల ప్రశంసలను అందుకుంది, వీటిలో ‘ఉత్తమ కార్ వెబ్‌సైట్ 2012’, ‘అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్ 2012’, మరియు 2011, 2012లో వరుసగా రెండుసార్లు ‘వెబ్‌సైట్ ఆఫ్ ది ఇయర్ ఇండియా’ అవార్డులు ఉన్నాయి. ఈ ప్రసిద్ధి చెందిన గుర్తింపులు కార్దెకో బృందం నైతిక బలాన్ని ఖచ్చితంగా పెంపొందించాయి, అయితే సైట్ ట్రాఫిక్ ఆశ్చర్యకరంగా 3 కోట్ల సంఖ్యను దాటినప్పుడు మాకు కలిగిన తృప్తి మరియు ఏదో సాధించామనే భావనకు మాత్రం ఏదీ సాటిరాదు. విశ్లేషణ గణాంకాల ప్రకారం, కార్దెకో వెబ్‌సైట్ మొదటి 4 సంవత్సరాలలో 3.4 కోట్ల ఏకైక సందర్శకులకు సేవలను అందించి రికార్డు సాదించింది. అయినప్పటికీ, మా విధానం మరియు కృషి పట్ల మాకు విశ్వాసాన్ని పెంచింది మాత్రం 2012వ సంవత్సరంలో మా వెబ్‌సైట్‌ను సందర్శించిన 2.5 కోట్ల సందర్శకుల సంఖ్య, ఇది దాని గత 4 సంవత్సరాల ట్రాఫిక్‌కు దాదాపుగా సమానం.p>

ప్రస్తుతం గురించి కొంత..h3>

ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మేం మరిన్ని అవకాశాలను అందుకోవడానికి – ఇప్పటి వరకు ఎవరూ ఎంటర్ కానీ విభాగమైన ట్రక్కులు మరియు వాణిజ్య వాహనాల అనుబంధ శ్రేణిని లక్ష్యంగా చేసుకొని ట్రక్స్దెకోతో వాణిజ్య వాహనాల విభాగంలో ప్రవేశించాము. ట్రక్-శోధకుల అవసరాలపై శ్రద్ధ వహించి, వారి ట్రక్కింగ్ అవసరాలను తీర్చడానికి ఇలాంటి ఏకైక పోర్టల్‌ను రూపొందించాము. అనేక వినియోగదారుల దృక్కోణాన్ని దృష్టిలో ఉంచుకొని, స్పష్టమైన ట్రక్ సమాచారాన్ని ఆకర్షణీయమైన విధంగా అందించడానికి వివిధ సెక్షన్‌లు నిర్మించబడ్డాయి. అతి తక్కువ క్లిక్‌లతో ఉత్తమ ఫలితాలను అందించడమే లక్ష్యంగా సెర్చ్ వ్యాలిడేషన్‌ల నుండి నావిగేషన్ పధకాల వరకు ప్రతి విషయంలో శ్రద్ధ వహించాము– ఇది మీరు ట్రక్ కోసం శోధించడంలో సులభతరం చేస్తుంది. నాలెడ్జ్ విషయానికి వస్తే– ట్రక్స్దెకో అత్యంత వివరణాత్మక మరియు వైవిధ్యమైన సమాచార భాండాగారాన్ని కలిగి ఉంది, ఇది దాదాపుగా ప్రతి ఒక్క ట్రక్ సమాచారాన్ని కలిగి ఉంటుంది. ట్రక్స్దెకో వార్తల సెక్షన్ సంచలనాత్మక రహాస్య చిత్రాలను, థ్రిల్లింగ్ స్కూప్స్‌ను, ప్రత్యేక ఈవెంట్ కవరేజీలను – విరామం లేకుండా అందిస్తుంది. ఒక సమాంతర స్టోరీబోర్డ్, ట్రక్‌లపై సంచలనాత్మక అంశాలను, నిపుణుల రివ్యూలను, తాజా ట్రక్కింగ్ సాంకేతికత మరియు పెట్టుబడుల గురించిన సమాచారం తెలియజేస్తుంది, ఈ విధంగా అత్యుత్తమమైన సమాచారం మీ వద్దకు చేరుతుందని మీరు ఆశించవచ్చు. మీకు ఉన్న ఉత్సుకతను అనుభూతి చెందడానికి, అభివృద్ధి చెందిన వినియోగదారుల అనుభవాన్ని అందించే వైర్-డిజిటల్ వాతావరణాన్ని మీరు మా నుండి పొందుగలరు– సమగ్రమైన డేటాబేస్, తెలివైన సూచనలతో మీకు సేవలను అందిస్తాము. బ్రాండ్ పేర్లు, వాహన బాడీ రకాలు, ధరల పరిధి, ఇతర అంశాలు వంటి శోధన పారామితులతో మీ ప్రవర్తనను ట్రేస్ చేసే రిఫరెన్స్ మ్యాప్ మీ శోధనకు సరైన ఫలితాలను అందిస్తుంది. తాజా ట్రక్‌లు, పాపులర్ ట్రక్‌లు, కంపేర్ ట్రక్‌లు, డీలర్‌లు మరియు సర్వీస్‌లు కలిసి స్వతంత్ర కొనుగోలుదారులు మరియు విక్రయదారులు, డీలర్‌లు, సేవా కేంద్రాలు ఒక విస్తృతమైన నెట్‌వర్క్‌ను సృష్టిస్తాయి, ట్రక్ ట్రేడ్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని ఒకే చోట సమీకరించి, ట్రక్కును వెతికే పూర్తి ప్రక్రియను మునపటి కంటే సులభతరం చేస్తుంది.

×
మీ నగరం ఏది?