టాటా 1512 ఎల్పిటి Vs ఐషర్ ప్రో 2114XP: స్పెసిఫికేషన్ పోలిక

Modified On Jun 19, 2023 07:12 PMBy Dheeraj Nair

భారతదేశంలో ఈ-కామర్స్ విభాగం అభివృద్ధి చెంధుతున్న తరుణంలో వస్తువులను సమర్ధవంతంగా రవాణా చేయగల అధిక-టార్క్ మీడియం-డ్యూటీ ట్రక్కుల కోసం డిమాండ్ؚ మరింత పెరుగుతుంది. ఫలితంగా, రవాణా సంస్థలు మార్కెట్‌లోని రెండు ప్రసిద్ధ బ్రాండ్ؚలు అయిన టాటా మోటార్స్ మరియు ఐషర్ మోటార్స్ؚను నిశితంగా పరిశీలిస్తున్నారు.

అయితే, రవాణా కంపెనీలకు ఈ రెండు బ్రాండ్ల నుండి ట్రక్కును ఎంచుకోవడం కష్టంగా మారింది. అటువంటి వ్యాపారాలకు సహాయపడటానికి, రెండు ఉత్తమమైన మీడియం-డ్యూటీ ట్రక్కులు టాటా 1512 ఎల్పిటి మరియు ఐషర్ ప్రో 2114XP స్పెసిఫికేషన్ల వివరణాత్మక పోలిక ఇక్కడ ఇవ్వబడింది. చదవండి: 

టాటా 1512 ఎల్పిటి Vs ఐషర్ ప్రో 2114XP: పవర్‌ట్రెయిన్

టాటా 1512 ఎల్పిటికి 3.3-లీటర్ BS6-కు అనుగుణంగా ఉండే డీజిల్ ఇంజన్ పవర్‌ను అందిస్తుంది, ఇది 2600rpm వద్ద 167hpని మరియు 1000-2200rpm వద్ద 390Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ అధిక-టార్క్ గల సమర్ధమైన ఇంజన్ 5-స్పీడ్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్ؚతో జోడించబడింది. 

 వాహనం   టాటా 1512 ఎల్పిటి  ఐషర్ ప్రో 2114XP
ఇంజన్ 3.3-లీటర్ NG BS6 DI ఇంజన్ E494 4V TCI BS6-అనుగుణంగా ఉండే CRS DI ఇంజన్
గేర్ؚబాక్స్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5-స్పీడ్ మరియు 7-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 
పవర్    167hp 160hp
టార్క్  390Nm 500Nm

మరొకవైపు, ఐషర్ ప్రో2114XP BS6-అనుగుణంగా ఉండే CRS డీజిల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 2600rpm వద్ద 160hp మరియు 1200-1800rpm వద్ద 500Nm టార్క్‌ను అందిస్తుంది. ఎంచుకున్న వాహనం బాడీ పొడవుపై ఆధారపడి ట్రాన్స్‌మిషన్ మారుతుంది, 5252మిమీ బాడీ పొడవు ఎంపికకు 5-స్పీడ్ల గేర్‌బాక్స్ మరియు 5804మిమీ, 6101మిమీ, 6777మిమీ మరియు 7360మిమీ బాడీ పొడవుకు 7-స్పీడ్ల గేర్‌బాక్స్ వస్తాయి.

సంబంధిత లింక్: టాటా 709g ఎల్పిటి Vs ఐషర్ ప్రో 2059XP CNG: స్పెసిఫికేషన్‌ల పోలిక

బ్రేక్ మరియు సస్పెన్షన్ సెట్అప్: టాటా Vs ఐషర్

టాటా 1512 ఎల్పిటి ట్రక్ ఆటో స్లాక్ అడ్జస్టర్ మరియు ABSలతో డ్యూయల్ సర్క్యూట్ ఫుల్ ఎయిర్ S” క్యామ్ బ్రేక్ؚలతో వస్తుంది, ఇది ఫుల్ లోడ్ పరిస్థితులలో కూడా అద్భుతమైన నిలుపుదల సామర్ధ్యాన్ని నిర్ధారిస్తుంది మరియు బ్రేకులు అరగడాన్ని తగ్గిస్తుంది. ముందు సస్పెన్షన్‌లో హైడ్రాలిక్ డబుల్-యాక్టింగ్ టెలిస్కోపిక్ షాక్ అబ్సార్బర్‌లతో పారాబొలిక్/సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ ఉన్నాయి, వెనుక వైపు సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ ఉంటుంది. 

 వాహనం

టాటా 1512 ఎల్పిటి

ఐషర్ ప్రో 2114XP

బ్రేకులు

డ్యూయల్ సర్క్యూట్ ఫుల్ ఎయిర్ S" క్యామ్ బ్రేక్               

హెవీ-డ్యూటీ ఎయిర్ బ్రేక్ؚలు

ఫ్రంట్ సస్పెన్షన్

పారాబొలిక్/హైడ్రాలిక్ డబుల్-యాక్టింగ్ టెలిస్కోపిక్ షాక్ అబ్ؚసార్బర్ؚలతో సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్   

సెమీ-ఎలిప్టికల్ ల్యామినేటెడ్ లీవ్స్ 

రేర్ సస్పెన్షన్

సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ 

సెమీ-ఎలిప్టికల్ ల్యామినేటెడ్ లీవ్స్ 

అంతేకాకుండా, ఐషర్ ప్రో 2114XP రెండు వైపులా హెవీ-డ్యూటీ ఎయిర్ బ్రేక్‌లు అమర్చబడి వస్తుంది. ఈ వాహనం ముందు మరియు వెనుక హెల్పర్ కలిగిన సెమీ-ఎలిప్టికల్ ల్యామినేటెడ్ లీవ్స్ కలిగి ఉంటుంది. 

బరువు & కొలతల పోలిక:

టాటా 1512 ఎల్పిటి ట్రక్ స్థూల వాహన బరువు (GVW) 16020కిలో రేటింగ్ను కలిగి ఉంది. ఇది రెండు వీల్ؚబేస్ؚలలో అందిస్తున్నారు: 4200మిమీ మరియు 4830మిమీ, దీని ఇంధన ట్యాంక్ సామర్ధ్యం 160 లీటర్లుగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 225మిమీ మరియు టైర్ సైజు 9-R20-16PR. 

 వాహనం

టాటా 1512 ఎల్పిటి

ఐషర్ ప్రో 2114XP

GVW

16020కిలోలు

16371కిలోలు

వీల్ؚబేస్ ఎంపికలు

4200మిమీ మరియు 4830మిమీ

3900మిమీ, 4355మిమీ మరియు 5105మిమీ

ఇంధన ట్యాంక్ సామర్ధ్యం

160 లీటర్‌లు

190 లీటర్లు లేదా 425 లీటర్లు

టైర్ సైజ్ 

9-R20-16PR

9-R20-16PR

అంతేకాకుండా, ఐషర్ ప్రో 2114XP మూడు-వీల్ బేస్ ఎంపికలలో వస్తుంది, అవి: 3900మిమీ, 4355మిమీ మరియు 5105మిమీ మరియు దీని స్థూల వాహన బరువు (GVM) 1637కిలోల రేటింగ్ కలిగి ఉంటుంది. ఈ ట్రక్ 258మిమీ గ్రౌండ్ క్లియరెన్ؚతో మరియు ఎంచుకున్న బాడీ పొడవును బట్టి రెండు ఇంధన ట్యాంక్ ఎంపికలతో వస్తుంది: 5252మిమీ, 5804మిమీ మరియు 6101మిమీ కోసం 190 లీటర్లు; 6777మిమీ మరియు 7360మిమీ కోసం 425 లీటర్లు, దీని టైర్ సైజ్ 9-ఆర్20–16PR వరకు ఉంటుంది. 

ఏ ట్రక్ؚను ఎంచుకోవాలి?

వీటిపై అవగాహన లేనివారి కోసం ఈ వివరాలను తెలియజేస్తున్నాం, టాటా 1512 ఎల్పిటి సమర్ధమైన మరియు శక్తివంతమైన పవర్ؚట్రెయిన్ؚతో వస్తుంది, కానీ ఐషర్ ప్రో 2114XP ఇంజన్ మెరుగైన టార్క్ అవుట్ؚపుట్ؚను అందిస్తుంది.

ఐషర్ ప్రో 2114XP కూడా బహుళ వీల్ؚబేస్ ఎంపికలు మరియు లోడ్ బాడీ పొడవులతో వస్తుంది. కేవలం రెండు వీల్ؚబేస్ ఎంపికలలో 4200మిమీ మరియు 4830మిమీ వచ్చే టాటా 1512 ఎల్పిటి ట్రక్ల విధంగా కాకుండా ఈ బ్రాండ్ మూడు వీల్ బేస్ؚలను అందిస్తుంది: 3900మిమీ, 4355మిమీ మరియు 5105మిమీ. 

ప్రో 2114XP ఇంధన ట్యాంక్ సామర్ధ్యం విషయంలో కూడా పై స్థాయిలో నిలుస్తుంది. ఇది ఎంచుకున్న బాడీ పొడవుపై ఆధారపడి, 190 లీటర్లు లేదా 425 ట్యాంక్ సామర్ధ్యంతో వస్తుంది. టాటా 1512 ఎల్పిటి కేవలం 160 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్ధ్యంతో వస్తుంది. 

అయితే, టాటా 1512 ఎల్పిటి రూ.23.40 లక్షల ప్రారంభ ధరను కలిగి ఉండగా, ఐషర్ ప్రో 2114XP రూ.24.78 లక్షల ప్రారంభ ధరతో వస్తుంది ఇది 1512 ఎల్పిటి కంటే అధికం.                                                                                                                      

ధర మాత్రమే కాకుండా, టాటా 1512 ఎల్పిటి దాని రుజువైన మన్నికకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది నిరంతర రవాణా కార్యకలాపాలకు మరియు దీర్ఘకాల రవాణా పనులకు సరిపోతుంది. టాటా మోటార్స్ విక్రయానంతర సేవలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఐషర్ మోటార్స్ కూడా మెరుగైన విక్రయానంతర సేవలను అందిస్తుంది, అయితే టాటా మోటార్స్ సాధారణంగా ఎక్కువ పేరును పొందింది. 

తీర్పు: 

మీడియం డ్యూటీ ట్రక్ లేదా భారీ కార్యకలాపాల కోసం ICV కోసం చూస్తున్న వారికి టాటా 1512 ఎల్పిటి సరైనది. ఈ ట్రక్ మూడు-సంవత్సరాలు లేదా 3 లక్షల కిలోమీటర్ల వారెంటీతో వస్తుంది మరియు 10550కిలోల రేటెడ్ పేలోడ్ కలిగి ఉంది.

అయితే, మీరు ప్రీమియం, హై-టార్క్ ట్రక్ కోసం చూస్తుంటే, ఐషర్ ప్రో 2114XP మీకు ఉత్తమమైన ఎంపిక. ఈ వాహనంపై అత్యధిక వారెంటీ ప్యాకేజీ కూడా వస్తుంది. మూడు సంవత్సరాలు లేదా అపరిమిత కిలోమీటర్ల వారెంటీ (వాహనంపై) మరియు ఇంజన్ మరియు గేర్‌బాక్సులపై నాలుగు సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారెంటీ ఉంది.

ఇంకా చెప్పాలి అంటే, ఐషర్ ప్రో 2114XP క్రూయిజ్ కంట్రోల్ మరియు DRL హెడ్‌ల్యాంపులు వంటి ఫీచర్లతో వస్తుంది, ఇది టాటా 1512 ఎల్పిటిలో లేవు. ఐషర్ ప్రో 2114XP కూడా విభాగంలోనే ఉత్తమైన 10631కిలోల పేలోడ్ؚను అందిస్తుంది.

క్లుప్తంగా చెప్పాలంటే, సవాళ్లతో కూడిన పనులను ఎదుర్కొవడానికి చవకైన ట్రక్ కోసం చూస్తున్న వారికి టాటా 1512 ఎల్పిటి అనువుగా ఉంటుంది మరియు ఐషర్ ప్రో 2114XP మరింత ప్రీమియం లుక్, పేలోడ్ మరియు టార్క్ కోసం చూస్తున్న వారికి సరిపోతుంది. 

మరింత చదవండి 

టాటా ఏస్ గోల్డ్: గూగుల్ؚలో ఎక్కువగా అడిగిన 11 ప్రశ్నలు 

BS-6 ఫేజ్ నిబంధనలకు ముందు తమ వాణిజ్య రవాణా వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్

₹21.20 - ₹29.60 Lakh*
  • శక్తి 160 హెచ్పి
  • స్థూల వాహన బరువు 16140
  • మైలేజ్ 5.5-6.5
  • స్థానభ్రంశం (సిసి) 3760
  • ఇంధన ట్యాంక్ (లీటర్లు) 190
  • పేలోడ్ 10491/10631
₹23.40 Lakh నుండి*
  • శక్తి 167 హెచ్పి
  • స్థూల వాహన బరువు 16020
  • మైలేజ్ 6.5
  • స్థానభ్రంశం (సిసి) 3300
  • ఇంధన ట్యాంక్ (లీటర్లు) 160
  • పేలోడ్ 10550

తాజా వాణిజ్య వాహనాలు

ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్

ప్రసిద్ధ నమూనాలు

  • ట్రక్కులు
  • పికప్ ట్రక్కులు
  • మినీ ట్రక్కులు
  • టిప్పర్లు
  • ట్రైలర్లు
  • 3 వీలర్
  • ఆటో రిక్షా
  • ఈ రిక్షా
*ఎక్స్-షోరూమ్ ధర in New-Delhi